Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో ఎలుకలు పట్టే జాబ్‌.. ఏటా రూ. 1.2 కోట్ల జీతం!

new york city hires its first ever rat czar
Advertisement
  • ర్యాట్‌ క్యాచర్‌ గా కేథలిన్‌ కొరాడీని నియమించిన న్యూయార్క్ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌
  • ‘డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌’ పేరిట ఉద్యోగం
  • ఎలుకలను చంపకుండా కంట్రోల్ చేయడమే పని..
Advertisement
ఎలుకలు పెరిగిపోయాయి.. ఏం చేయాలి? సింపుల్‌.. ‘పిల్లులను పెంచేస్తే సరి..’ అనే డైలాగ్‌ లు వినిపిస్తుంటాయి కదా. కానీ ఎలుకల సమస్య అంత చిన్నదేమీ కాదు.. ఎలుకలను పట్టడం అంత నామోషీ కూడా కాదు.. అది ఏకంగా ఏడాదికి 1.2 కోట్ల రూపాయల జీతమిచ్చే ఉద్యోగం.. అదెలా అంటారా? న్యూయార్క్‌ నగరంలో తాజాగా ర్యాట్‌ క్యాచర్‌ ను నియమించుకోవడమే ఎగ్జాంపుల్‌.

తట్టుకోలేనంతగా ఎలుకల బాధతో..
కొన్నేళ్లుగా న్యూయార్క్‌ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ఎలుకల సమస్యతో బాధపడుతున్నాయి. సబ్‌ వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోవడం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ‘ర్యాట్‌ క్యాచర్‌’ను నియమించారు.

900 మంది అప్లికేషన్ల నుంచి..
  • ‘డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 900 మంది అప్లై చేసుకోగా.. వారిలో కేథలిన్‌ కొరాడీని ఎంపిక చేశారు.
  • ఓ స్కూల్‌ లో టీచర్‌ గా పనిచేసిన ఆమె.. విద్యా శాఖలో ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై చిన్నపాటి రీసెర్చ్‌ చేశారట.
  • ఇప్పుడు ఆమె చేయాల్సిన పనేమిటంటే.. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోస్‌ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్‌ వేలలో ఎలుకలు ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడమేనట.
  • ట్విస్ట్‌ ఏమిటంటే.. విష పదార్థాలు పెట్టి ఎలుకలను చంపకూడదు. ఇంతకుముందు అలా చేస్తే.. ఆ విష పదార్థాలను, వాటిని తిని చనిపోయిన ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు చనిపోయాయట. అందుకే విషం పెట్టొ‍ద్దన్న రూల్‌ పెట్టారు.
Advertisement
Advertisement
USA
Rat catcher
Job
offbeat
Newyork
Viral Videos

More Telugu News